డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ జీవితం

image: 
Author: 
మల్లంపల్లి సోమశేఖరశర్మ
Body: 

      అవి వందేమాతరం విప్లవదినాలనుకుంటాను. 1905 - 1910 సంవత్సరాలలో భారతవర్షంలో సిపాయితిరుగుబాటుకు ఏభయిసంవత్సరాల పిదప మొట్టమొదటిసారి విప్లవ మరల మ్రోగింది. 1905 నుంచి స్వరాజ్యం ఉపాసనమంత్ర మయింది. కాంగ్రెసులోనే అవలంబింపవలసిన సందాలలో భేదాబిప్రాయాలు కలిగి నాయకులు, అతివాదులు మితవాదులు అని రెండుతెగలైనారు.