ఆంధ్రప్రదేశ అభివృద్ధి అసమానతలు

image: 
Author: 
సి.సాంబిరెడ్డి, కె.జోజయ్య, యన్.వేణుగోపాలరావు, ఐ.నరసయ్య
Body: 

          స్వాతంత్ర్యానంతరం 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా 13 జిల్లాలతో (శ్రీకాకులం, విజయనగరం,విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం) కూడిన ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి. 1948 సెప్టెంబర్ నుండి 1956 వరకు తెలంగాణా ప్రాంతం అవిభక్త హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణా జిల్లాలను ఆంధ్రరాష్ట్రంతో కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది.