పుచ్చలపల్లి సుందరయ్య - రచనల సంకలనం

image: 
Author: 
పుచ్చలపల్లి సుందరయ్య
Body: 

         కమ్యూనిస్టు మహా నాయకుడు, ప్రజా ఉద్యమాల నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్య రచనల సంకలనం ఇది. వివిధ విషయాలపై కూలంకషంగా అధ్యయనం చేసిన విజ్ఞానఖని మాత్రమే కాక నిష్కళంక ప్రజా జీవితం గడిపిన విశిష్ట విప్లవకారుడాయన. దేశ రాష్ట్ర భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటిని సందర్భోచితంగా రచనల ద్వారా, రాజకీయ తరగతుల ద్వారా, ప్రసంగాల ద్వారా తెలియజేసారు. వాటిలో ఎంపిక చేసిన కొన్ని కీలక రచనల ఇందులో పొందుపర్చబడ్డాయి. గతంలో ఏరిన రచనల పేరుతోనూ, కొన్ని విడిగానూ వెలువడినప్పటికీ అందరూ కోరుకునే కొన్ని ముఖ్యమైన రచనలను ఇందులో ఇచ్చే ప్రయత్నం చేశాము.