గ్రంధాలయము

          స్వాతంత్ర్యానంతరం 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా 13 జిల్లాలతో (శ్రీకాకులం, విజయనగరం,విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం) కూడిన ఆంధ్రరాష్ట్రం ఏర్పడే వరకూ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవి. 1948 సెప్టెంబర్ నుండి 1956 వరకు తెలంగాణా ప్రాంతం అవిభక్త హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణా జిల్లాలను ఆంధ్రరాష్ట్రంతో కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం...

         కమ్యూనిస్టు మహా నాయకుడు, ప్రజా ఉద్యమాల నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్య రచనల సంకలనం ఇది. వివిధ విషయాలపై కూలంకషంగా అధ్యయనం చేసిన విజ్ఞానఖని మాత్రమే కాక నిష్కళంక ప్రజా జీవితం గడిపిన విశిష్ట విప్లవకారుడాయన. దేశ రాష్ట్ర భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటిని సందర్భోచితంగా రచనల ద్వారా, రాజకీయ తరగతుల ద్వారా, ప్రసంగాల ద్వారా తెలియజేసారు. వాటిలో ఎంపిక చేసిన కొన్ని కీలక రచనల ఇందులో పొందుపర్చబడ్డాయి. గతంలో ఏరిన రచనల పేరుతోనూ, కొన్ని విడిగానూ...

      రాష్ట్రంలో జలవనరులు పుష్కలంగానే ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు అనేక ఉపనదులు కూడా ప్రవహిస్తున్నాయి. అయితే ఈ జలవనరులను వివిధ ప్రాంతాల అవసరాలను, ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాపిత దృష్టితో వినియోగించుకోవడంలోనే లోపం జరుగుతున్నది. ఫలితంగా వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అపోహలకు ఆస్కారం కలుగుతున్నది. ఒక ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణంతో, మరొక ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పోటీ పెట్టడం జరుగుతున్నది ప్రాంతాల మధ్య వివాదాలకు, విభేదాలకు, వేర్పాటువాదాలకు ఈ ధోరణులు దారితీస్తున్నాయి.
      సమైక్యాంధ్ర కోసం జరిగిన పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన...

        నేడు గ్రామీణ సంబంధాల గురించిన అధ్యాయనాలు జరగాల్సినంతగా జరగడం లేదు. నిజానికి ఆ రంగాన్ని ప్రధాన స్రవంతి ఎకడమిక్ పరిశోధకులు విస్మరిస్తున్నారు. దేశంలో 70 శాతం మంది జీవిస్తున్న గ్రామీణ ప్రాంతాల విశ్లేషణల ప్రాధాన్యతను వారు గుర్తించడంలేదు. గ్రామీణ ప్రాంతాలలో అత్యధికుల పరిస్థితి దుర్భరంగా ఉందన్నది వాస్తవం. వారి స్థితిగతులు మెరుగవడానికి, వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి వ్యవసాయ సంబంధాలలో సమూలమైన మార్పులు అవసరం. వీటి ప్రాతిపదికను సశాస్త్రీయంగా అర్థం చేసుకోవలసిఉంది. దానికి దోహదపడే లోతైన, విస్తృతమైన పరిశోధనలు రాయవలసి ఉంది. ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల గ్రామీణ...

     "విప్లవపథంలో నా పయనం" అన్న సుందరయ్యగారికి ఆత్మకథ రెండవ భాగాన్ని మీకు ఇందులో అందిస్తున్నాం. మే 1వ తేదీకి ఆ మహనీయుడి 76వ జన్మదినోత్సవం జరుగుతుంది. మే 19వ తేదీకి ఆయన మూడవ వర్థంతి వస్తోంది. ఆ సందర్భానికి గ్రంథస్తం ఆయన ఈ అమూల్య ప్రచురణతోపాటు "సుందరయ్య విజ్ఞాన కేంద్ర" నిర్మాణాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సమర్పించుకోవాలని దాని ట్రస్టు కమిటీ ఆశించింది. కాని దాని తుది మెరుగులు దిద్దడంలో కొద్ది మాసాలు ఆలస్యం అయ్యేట్లున్నది.
    ఈలోగా ఒక విచారకర పరిణామం కలిగింది. ఆయన జీవిత భాగస్వామిని, తోటి కామ్రేడూ శ్రీమతి లీలా సుందరయ్య మార్చి 21వ తేదీన అస్తమించారు. ఆ...

                శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పాఠకులకు సుపరిచుతులు. వారి కథలు ఇప్పటికి మూడు భాగాలుగా ప్రచిరించాము. పాఠకులు అత్యంతానందంగా శ్రీకరించారు.

                ఇవి చీసి శ్రీ శాస్త్రిగారి రచనలు తమ వద్ద ఉన్నాయని, తెచ్చి మాకిచ్చిన మిత్రులున్నారు. వారికి దన్యవాదాలు. అవి కూడ త్వరలోనే ప్రచిరించగలము.

                పాఠకులు ఈ ప్రచరుణలను ఆదరించగలరని విశ్వసిస్తున్నాము.

ఏ యుగం సంగతి ఎట్లా ఉన్నా, ఏ కాలం సంగతి ఎట్లా ఉన్నా తెలుగు సాహిత్యంలో నిశ్చయంగా ఈ యుగమూ, ఈ కాలమూ కథానికా యుగమే! కథానికా కాలమే!

అట్లా అన్నానని కవులు ఘర్షణకు దిగనక్కరలేదు. ఎందుకంటే ఎల్ల యుగాలూ, ఎల్ల కాలాలూ మళ్ళీ నిశ్చయంగా కవిత్వానికి చెందినవే!

సుమారు 16 సంవత్సరాల క్రింద మా నాన్నగారి మిత్రమ ఇంటికి వచ్చినప్పుడు ఓ కథ రాయవోయ్! "జై భారత్" లో వేద్దాము అన్నారు.

నేను రాసిన కథలన్నిటిలో నాకు నచ్చినవి వీటికన్న ఎక్కువ వుండవు. వాటిలో కొన్ని ఈ సంకలనంలో వున్నాయి. ఈ సంకలనంలో వైవిధ్యంకోసం ప్రయత్నించారు.

మరి ఆ ప్రయత్నమూ, కథ వెనుక కథ ఇవ్వడంలో నా ఉద్దేశమూ ఎంతవరకూ నెరవేరాయో చెప్పవలసినవారు మీరే.

నేను ఆ యూనివర్సిటిలో చేరిన తొలిరోజు మనుష్యులు క్రొత్త; భాషవేరు అంతా అయోమయంగా ఉండేది. దాదాపు కాలమంతా ఒంటరిగానే గడుపుతూ ఉండేవాడిని.

పరాయి యూనివర్సిటీ వాడికి స్కాలరుషిప్పు ఇవ్వడం చూసి నా సహోదరులలో కొందరికి కోపంగా ఉండేది. సుమిత్ర, రామన్, శంకర్ అంతా మొదటినుంచీ సహోదరులు. అంతా కలిసి లేబరిటరిలో కూర్చొని బాతాఖానీ కబుర్లు కొడుతూ ఉండేవారు.

Pages