గ్రంధాలయము

      డా.తుమ్మల రామకృష్ణ వ్యక్తిత్వంలోని మంచితనం వారి రచనల్లో కూడా చోటుచేసుకున్నది. కథా వ్యవసాయానికి రాయలసీమ చైతన్యవంతమైన ప్రదేశం. ఇక్కడి నుండి వెలువడుతున్న బలమైన, భిన్నమైన, విలక్షమైన ఆణిముత్యాల్లాంటి కథానికలు భారతీయ సాహిత్య క్షితిజాన్ని విస్తరించాయి.

          ఈ కరువు సీమ రచయితల్లో మిత్రులైన తుమ్మల రామకృష్ణ అపూర్వ సృజనాత్మక శక్తిసంపన్నమైన కథా రచయిత. శాపగ్రస్త అస్పృశ్య సమాజమే వీరి కథా వస్తువు. చారిత్రక కుల పరిజ్ఞానం వీరి మనస్తత్వం. అపూర్వ ప్రతిభా సంపన్నమైన ఈ...

      ఆ అమ్మాయి, రోజూ సరిగా అదేవేళకు అక్కడకు వస్తుంది. గోదావరి అలలమీద గాలిబంతులులాగా ఎగరేసుకుంటూ వెన్నలచారికలు చీకటిదొంతరలను తరమడం మొదలుపెట్టగానే, మోడైపోయినచెట్టు, ఉగ్గం వేరుమీద నుంచి, మోపినతల ఎత్తి, నేలను ఆసరాతీసుకుని లేచి, నంతెగమిదనుంచి వచ్చే రైలు పొల్లుకూతలో కలిపి,ఇగుర్చుకుపోయిన గుండెలువిచ్చేటంత కేకపెట్టి, బావురుమనడం, ఇంటిగుమ్మం ఎక్కేలోపల సముదాయించుకుంటుంది....

         ఈ సంపుటములోని కథానికలన్నీ 'గోలకొండ పత్రిక' నుండి పునర్ముద్రితములు. నన్ను ఆదరించి, ప్రోత్సహించిన పత్రికాధిపతులకు, మరియు నా మిత్రులు సర్వ శ్రీ కటకం పురుషోత్తం, ఎం.ఎస్., పరాశరం గోపాలకృష్ణమూర్తి, ఎం. ఏ., సరాబు విశ్వనాధం, ఎం.ఎస్.సి. గార్లకు నేను సర్వదా కృతజ్ఞుడను....

 

     ఇంకా... బాగా చీకటి పడలేదు. పార్కులో కూచున్నాను; నా పక్కను... వచ్చి బెంచీ చివర చదికిల పడ్డాడు....

   అరవై ఉంటాయా? అన్నీ ఉడిగాయా... అయితే నేం... అలా మాటి మాటికీ మీసంమీది చెయ్యి... అదేనాటిదో అలవాటా? ...

   పిలుస్తూంది ఎవరో అమ్మాయి... పిల్లను చంకనెత్తుకొని ... కనబడుతూ ఎదురుగా దూరంలో నిలుచుని; ...

 

         శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథలు ప్రచురిద్దామని నిర్ణయించుకొని వారిని అనుబూతి యివ్వవలసినదిగా కోరాము. మేము కోరిన దేతడవుగ మకు అనుమతి యిచ్చినందుకు వారికి సదా కృతజ్ఞులము. అనుమతించడమేగాక అక్కడక్కడ చెదిరివున్న కథల నన్నింటినీ సేకరించి నాలుగు సంపుటాలుగా మాకు అందజేసినందుకు మల్లాదివారికి మరొక సారి కృతజ్ఞత తెలుపుకొంటున్నాము....

       "మేరీకహానీ" అని హిందీభాషలో ఈ పుస్తకానికి పేరు పెట్టడములో గ్రంథకర్తకు హిందీమాదుర్యము తెలిసి ఉండవలిసింది; హిందీ యావద్భారత దేశభాష అనే అదరమైనా ఉండవలిసింది. "నా కథ" అనముకంటె "మేరీకహానీ" అనడములో వైచిత్రము లేక పోలేదు....

 

     ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో శేషాచలం కంపెనీవారన్నట్టు ఎన్నో అనర్ఘరత్నాలు.

    గత నూరేండ్లుగా మహాకవులు, పండితులు, రచయితలు మన సాహిత్యాన్ని ప్రభావితం చేసిన మహనీయులు ఎందరో వున్నారు. సాహిత్య ప్రగతిని మలుపులు తిప్పిన చిరస్మరణీయులయిన మహానుభావులూ చాలామందే వున్నారు. అందరికీ వినమ్ర వందనాంజలి.

       ఇది,   శివుని కథ అనుకు నేరు: శ్రీనాథునిం కథ:  

       అంతా నాని కథ కాదు: ఆ చిన్నదాని కథ కొరత; ఇక అసాంతం వినండి    

       అప్పటికి రమారమి పది పద్దెనిమిది సంవత్సరాలకు పూర్వం శ్రీనాథుడు దక్షారామంలో ఆరామం జేరుకుని, తనకు అవసరం  భీమ నాధునికి ధారపోసే,    ఆ రోజుల్లో,     

         శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు పాఠకలోక నుపరిచితలు. వారి కథలు యిప్పటికి 4 నాలుగు భాగాలుగా ప్రచురించాము. పాఠకులు అత్యంతానందంతో స్వీకరించారు.

         ఇవి చూచి శ్రీ శాస్త్రిగారి రచనలు తమ వద్ద వున్నాయని, తెచ్చి మాకిచ్చిన మిత్రులున్నారు. వారికి ధన్యవాదాలు. అవికూడా త్వరలోనే ప్రచురించగలము....

 

    సరిగ్గా సాయంత్రం నాలుగయ్యింది. కాన్వెంట్ హోంబెల్లు గణగణమని మోగింది.

    ఆకర్షణీయమైన రంగు రంగుల యూనిఫారం ధరించిన బాల బాలికలంతా బంధని విముక్తులయినట్లు ఆ తరగతులనుండి బయల్పడ్డారు.

   ఉదయం ఎప్పుడో వచ్చారేమో, అమ్మా నాన్నా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఒక్కసారిగా గుర్తుకు రావడంతో ఎక్కడలేని ఆనందోత్సాహాలతో లేడి పిల్లల్లా చెంగు చెంగున ఎగురుతూ రోడ్డు మీదికి పరుగులు ప్రారంభించారు.......

Pages