గ్రంధాలయము

      ఎందరో సాహితీ ప్రముఖులు. అందరికి వందనాలు. నా కథలను ప్రచురించిన ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వార్తపత్రికలకు వనితాజ్యోతి మాసపత్రికకు, కృష్ణాపత్రిక దిన పత్రికను ఆకాశవాణి వారికి నా కృతజ్ఞతలు.

           నా కథలు చదివి అభిప్రాయం రాసియిచ్చిన ఆంధ్రప్రభ వీక్లీ డిప్యూటీ ఎడిటర్ వాకాటి పాండురంగరావుగారికి నా కృతజ్ఞతలు.

         మేము అయిదుగురం విద్యార్థులం. మంచి పుస్తకాలన్నా మంచి నేస్తాలన్నా మా కెంతో ఇష్టం . కధలు వ్రాయడం కూడా యిష్టమే చదవడంతో పాటు, ఇష్టమైన పనులు కష్టమైనా చేయడానికి వుత్సాహంగా వుంటుంది. కనుక కనపడ్డా కథలు వ్రాయగలిగేం. అయితే; ఈ కథలు కధాసాహిత్యంలో నిలిచిపోయేవనిగానీ, లేక, రచయితలుగా మమ్మల్నీ నిలబెడతాయని గాని మేం అనుకోవడం లేదు. ఇవాళ పత్రికల్లో మనంచదివే కధల్లో వుంది; అని కూడ చెప్పబోవడం లేదు. ఎందుకంటే, మా స్థాయి ఏమిటో మాకు తెలుసు. అంత మాత్రాన మామీద మాకు నమకం లేకపోలేదు.మేం భాగ వ్రాస్తాం. ఇంకా మంచివి, యింకా...

     "మామయ్యా! క్రితం ఈసారి, యిమ్మాటు సముద్రం గురించి చెప్తానన్నావు కదూ! గుర్తుందా?" అని అడిగాడు శీను అప్పుడే వచ్చిన మామయ్యను చూడగానే.

       "ఏమిట్రా నీ గొడవ యింట్లోకి రానివ్వరా మామయ్యను" అని నాన్నగారు కోప్పడేసరికి శీను. నెమ్మదిగా వీధిలోకి వెళ్ళాడు ఆడుకుంటానికి....

          నిన్ను వెదుక్కుంటూ వచ్చానమ్మా!

           ఇంతదూరం, ఎక్కడో కృష్ణాతీరాన్నుంచి... చల్లని తల్లిని, కష్టాలన్నీ విని, కడుపులో పెట్టుకొని...

         జగన్నాటక సూత్రధారి, అనంతకోటి బ్రహాండ నాయకుడు సృష్టిస్థితి తిరోధాన భూతుడూ. అయిన భగవానుని లీలావై చిత్రిని గురించి వర్ణించ సాహసించగల వారెవరు? మహా మహిమాన్వితుడూ, అఘటనఘటనా సామర్ధ్యవంతుడూ అయిన వాసుదేవుని ప్రేరణ లేనిదే జగత్తులో యే పనియూ జరుగదనుట నిర్వనాదాంశమై, త్రికాలాబాధ్యమానమైన సత్యమై యున్నది....

        ఆ రాత్రి పుచ్చి పువ్వులాంటి వెన్నెల, ఎంతో మనోహరంగా ఉన్నది. చల్లని గాలికూడా ఉండటము మూలాన చాలా హాయిగా ఉన్నది.

        కాంతం  నా మంచముపైనే, నా ప్రక్కనే కూర్చొని ఉన్నది. మంచముపై నున్న తెల్లని దుప్పటి ఆ వెన్నెలలో మరీ తెల్లనై, చల్లగలికి కొద్దిగా లేచి, కాంతం చీర చెరగులను తాకి తృప్తితో క్రింద పడుతూ ఉన్నది....

   "మానవునిలో మంచి మార్పురానంత వరకు

   సమానత్వం అసాధ్య.

   వ్యక్తి ద్వేషం విడనాడకుంటే

   సమాజ ప్రగతి శూన్యం".

      చిరంజీవి 'భావా నరసింహం కలంనుండి పదనాలుగు పాయలుగా ప్రవహించిన కథాస్రవంతి యీసంపుటి.

    'సౌంధర్య సోపానాల' నధిరోహిస్తూ చివరకు 'అందమైన అబద్దం'తో      లేక అ    బద్దమైన అందముతో జీవిత వాహినిలో లీనమైన దీ కథావాహిని....

ఈ సంపుటిలోని కథలన్నీ 1957-75 మధ్య కాలంలో

  వ్రాసినవి. వీటిలో కొన్ని "కథలు-కాకరకాయలు"

      అనేపేర 1969లో సంపుటిగా వెలు

...

          సి. రామచంద్రరావుగారి కథలకంటే నాకు చాలా ఇష్టం. అవి ఇంకా చాలమందికి ఇష్టం కావడానికి కనీసం ఒక శతాంశమైనా నేను కారణం కావశం నా కిప్పటికీ సంతోషం కలిగిస్తుంది.

       రామచంద్రరావుగారిని చూస్తే కధలు రాసేవాడిలా, అందులోనూ తెలుగులో రాసేవాడిలా కనిపించరు. తెలుగు కథలు రాసేవారి కొక ప్రత్యేకమైన తరహా వుంటుందని నా ఉద్దేశం కాదు. అయినా, రామచంద్రరావుగారిలో కథా రచయితను...

Pages